శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): రైతుల సమస్యలపై పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరaకు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నాయకులు గురువారం ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్తుండగా పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేసి చందానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అదుపులో మిద్దెల మల్లారెడ్డి, గుర్ల తిరుమలేష్, ప్రతాప్ రెడ్డి, ఉమేష్ తదితరులు ఉన్నారు.