నమస్తే శేరిలింగంపల్లి:గోరక్షణ సమితి, బజరంగ్ దళ్, విశ్వహింద్ పరిషత్ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి బయల్దేరేందుకు సన్నద్దమైన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భవన్ ముట్టడికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గచ్చిబౌలి డివిజన్ కార్యాలయానికి పెద్ద ఎత్తున భజరంగ్ దళ్, విహెచ్ పి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చేశారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హన్మంత్ నాయక్ పోలీసులు ముందస్తుగానే హౌజ్ అరెస్ట్ చేశారు.