విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్ లోని మండల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్యపుస్తకాలను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్ధులకు‌ అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి వలన విద్యార్థులు ప్రత్యక్ష ‌బోధనకు దూరమవుతున్నారని అన్నారు. ఆన్ లైన్ బోధన ప్రత్యక్ష బోధనకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యధిక ఫీజులతో భారం అవుతున్న దశలో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, త్రాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం, పాఠశాల గ్రంథాలయం, ఆధునిక కంప్యూటర్ ల శిక్షణ, ఎంతో అనుభవం గల నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధన ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు వెంకటేష్, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, విద్యార్థినీవిద్యార్థులు, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు ఈశ్వర , కిషన్ సింగ్, శ్రీను, వెంకటేష్, మర్రప్ప, మహదేవ్అప్పా, హనుమంతు, ఎల్లమ్మ, చిలకమ్మ, నాగరాజు, మురళి, రాజు, లక్ష్మణ్, శ్రీనివాస్, ప్రసాద్, సురేష్ , ప్రకాష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్టి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here