
నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మహమ్మారితో ఇటీవల జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని వీఎఫ్ఎఫ్ సంస్థ డైరెక్టర్ గజ్జల యోగానంద్ తెలిపారు. బుధవారం పలువురి బాధితులకు చెక్కు ద్వారా యోగానంద్ ఆర్థిక సహాయం అందజేశారు. సామాజిక సేవలో భాగంగా ఇప్పటి వరకు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న 200 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. ఈ కుటుంబాలు ఆర్థికంగా నిలబడేందుకు వరుసగా 3 నెలల పాటు ఈ సహాయం అందజేస్తామని యోగానంద్ తెలిపారు. మనోబలంతో కోవిడ్ కష్టాలను అధిగమించవచ్చని, జీవితంలో ఒడిదుడుకులు సహజమని ధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. బాధితులకు భవిష్యత్తులో కూడా అవసరమైన మేరకు తగిన సహాయసహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో రాజు శెట్టి,గాదె గోపాల్మా, మారం వెంకట్,స్వాతి, సత్య, రాములు, వీరేష్, రమేష్ సోమిశెట్టి,తదితరులు పాల్గొన్నారు.