గణేష్ నవరాత్రులు శాంతియుతంగా జరిగేలా చూడాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక నవరాత్రోత్సవాలు, నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పోలీస్ అధికారులకు సూచించారు. రాబోయే గణేష్ పండుగను దృష్టిలో ఉంచుకుని గణేష్ బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర గురువారం సీపీ కార్యాలయంలో బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ ల డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లతో, ట్రాఫిక్ , సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, ఎస్ఓటీ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతవరణంలో జరగాలన్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో, హైదరాబాద్ పోలీసులతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సీసీటీవీ ల పై దృష్టి పెట్టాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా, డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ సందీప్, ఏడీసీపీలు, ఏసీపీలు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశం లో మాట్లాడుతున్న సైబరాబాద్ సీపీ‌‌ స్టీఫెన్ రవీంద్ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here