నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ పార్టీ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలసి ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అణిచివేత పరిస్థితులను ఆధిగమించి, ఆత్మగౌరవ ప్రతీకగా ఎగిరిన ఏకైక జెండా గులాబీ పార్టీ జెండా అని అన్నారు. పార్టీ నాయకులు చాంద్ పాషా, బాల్ రెడ్డి, నిర్మల, గౌరీ, రూపారెడ్డి, నరసింహ సాగర్, పేరుక రమేష్ పటేల్, శ్రీనివాస్ చౌదరి, శామ్యూల్ సాయి కుమార్, బసవ రాజు, రవి శంకర్ నాయక్, రవి గౌడ్, తాడెం మహేందర్, నందు, ఎర్ర రాజు, అశోక్ సాగర్, వెంకటి, తిరుపతి యాదవ్, రామకృష్ణ, ప్రభాకర్, గౌస్ పటేల్, శివకుమార్, గణపతి, ముక్తార్, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, మంగలి కృష్ణ, దీపక్, షేక్ రఫీ, వివిరావు, వసీమ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.