నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్తి దవాఖానను స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ రవికిరణ్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ సోమవారం ప్రారంభించారు. అనంతరం బస్తీ దవాఖానా ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ స్వరాజ్యలక్ష్మీ, ఉప వైద్యాధికారిణి డాక్టర్ సృజన, చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుదాంషు, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు పితాని శ్రీనివాస్ లక్ష్మీ, శ్రీనివాస్, రామచందర్, నాయకులు సంజీవ రెడ్డి, డివిజన్ టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, సాంబయ్య, బి.శ్రీనివాస్, మల్లారెడ్డి, రాజేష్, ప్రసాద్, సత్యం, ప్రకాష్ రెడ్డి, మహిళలు ఉమాదేవి, పద్మ, రంగస్వామి, జీ.హెచ్.ఎం.సి అధికారులు ఈ.ఈ శ్రీకాంతి, డీ.ఈ రూపాదేవి, ఏ.ఈ ప్రశాంత్ తదితరులు .పాల్గొన్నారు