నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో, బస్తీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు పలు సదుపాయలు కల్పించేందుకు పట్టణ ప్రగతి ఎంతగానో దోహదపడుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి విలేజ్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శానిటేషన్ సిబ్బందితో తొలగింపజేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, ఏఈ కృష్ణ వేణి, శానిటరీ ఇన్ స్పెక్టర్ జలెందర్ రెడ్డి, సూపర్ వైజర్ భరత్, జీహెచ్ఎంసీ అధికారులు, సీనియర్ నాయకులు శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, శ్రీశైలం , రమేష్, రంగస్వామి, వేణు, రాజేందర్, సతనారి, నగేష్, రమేష్, రంగస్వామి, ఎస్. వెంకటేష్, ఎం. సురేష్, ఎం. శంకర్, నర్సింగ్ రావు, ఎస్. ప్రశాంత్, బీ. శ్రీకాంత్, ఎస్. వినయ్, కె. జీవా, సాయి, కార్యకర్తలు పాల్గొన్నారు.