చందాన‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌నివారం విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: విద్యుత్ తీగ‌ల‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ‌ల తొల‌గింపు, ఇత‌ర మర‌మ్మ‌త్తుల కార‌ణంగా చందాన‌గ‌ర్ ప‌రిస‌ర‌ ప్రాంతాల్లో శ‌నివారం విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్టు తారాన‌గ‌ర్ ఆప‌రేష‌న్స్ ఏఈ ర‌విచంద్ర ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 11 కెవి ఇంజ‌నీర్స్ ఎన్‌క్లేవ్ ఫీడ‌ర్ ప‌రిధిలోని ఇంజ‌నీర్స్ ఎన్‌క్లేవ్, గంగారంల‌లో ఉద‌యం 10 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, హుడా కాల‌నీ ఫీడ‌ర్ ప‌రిధిలోని హుడాకాల‌నీ, ఎక్సైజ్ పోలీస్‌స్టేష‌న్‌, గంగారం హ‌నుమాన్ దేవాల‌యం ప్రాంతాల‌లో మ‌ధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వ‌ర‌కు, మైత్రీన‌గ‌ర్ ఫీడ‌ర్ ప‌రిధిలోని చందాన‌గ‌ర్ రైల్వేస్టేష‌న్ ప‌రిస‌రాల్లో మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు, తార‌న‌గ‌ర్ ఫీడ‌ర్ ప‌రిధిలోని పీజేఆర్ స్టేడియం, శివాజీన‌గ‌ర్ ద‌ర్గ ప్రాంతంలో సాయంత్రం 4.30 నుంచి 5.30 వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌ర నిలిచిపోతుంద‌ని, వినియోగదారులు గ‌మ‌నించాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here