ఘ‌నంగా మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌ర్ జ‌యంతి… హోప్ ఫౌండేష‌న్ ఆద్వ‌ర్యంలో మ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మహాత్మా బసవేశ్వర 888వ జయంతిని పుర‌స్క‌రించుకుని హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్‌ ఆధ్వర్యంలో ప్ర‌భుత్వ విప్ గాంధీ నివాసంలో వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌ర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించిన ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ, స్థానిక‌ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుల‌తో హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్ కుమార్ మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మహాత్మ శ్రీ బస్వేశ్వర 888 వ జయంతి శుభాకాంక్షలు తెలియచేసారు. అపూర్వ ప్రజాస్వామ్య వాది బసవేశ్వరుడని, పాల్కురి సోమనాథుడు తన ఆరాధ్య దైవమైన బ‌స‌వేశ్వ‌రుడిపై బసవ పురాణం రాశాడ‌ని గుర్తు చేశారు. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం పార్లమెంట్ ప్రాంగణంలో బ‌స‌వేశ్వరుని విగ్రహన్ని ఏర్పాటు చేసింద‌ని అన్నారు. అదేవిధంగా లింగాయత ధర్మకర్త సృష్టికర్త మహాత్మ బస్వేశ్వరుడు విశ్వ గురువుగా ఖ్యాతిగ‌డించారన్నారు. మహా మానవతా వాది, సంఘ సంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడనికి క్రీ.శే. 12 వ శతాబ్దంలో నే పునుకున్న సాంఘిక విప్లవకారుడ‌ని అన్నారు. అదేవిధంగా స్త్రీ , పురుష అసమానతలు తొలగించడానికి కృషి చేసిన అభ్యుదయవాది అని, దళితులకు ఆలయ ప్రవేశం కలిపించిన ప్రగతి శీలి అని, మొట్టమొదట కులాంతర వివాహం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని, తన కాలపు సమాజ జీవితంలో వెలుగులు నింపిన మహనీయుడు బ‌స‌వ‌న్న అని కొనియాడారు. ఆయ‌న జ‌యంతి వేళ మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు భీం రావు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌హాత్మ బ‌స‌వేశ్వ‌ర్ చిత్ర‌ప‌టం వ‌ద్ద మ‌హిళ‌ల‌కు చిర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, నార్నే శ్రీనివాస్ రావు, నిర్వాహ‌కుడు కొండా విజ‌య్‌కుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here