శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగు రంగుల పువ్వులను ఒక్కచోట పేర్చి బతుకమ్మలను తయారుచేసి వాటితో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడారు. ఉత్సవాల్లో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ సందడి నెలకొంది.