నమస్తే శేరిలింగంపల్లి: దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడని, కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు జైపాల్ అన్నారు. గజ్వేల్ లో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు జైపాల్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గర్లోనే ఉందని జైపాల్ అన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రోజుకో మాట చెబుతూ రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నాడని రేవెళ్ల రాజేష్ అన్నారు. దళితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ రఘునందన్ రెడ్డి, రేవెళ్ల రాజేష్, ఇనాయత్ పటేల్, రేణుక, రాజన్, నరసింహా గౌడ్, అజీమ్ ఉద్దీన్, శ్రీహరి గౌడ్, దుర్గేష్, జమున, సుకన్య, అన్నపూర్ణ, ఎల్లప్ప తదితరులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.