టిఆర్ఎస్ ప్రభుత్వం రజాకర్ల పాలనను తలపిస్తోంది: కసిరెడ్డి భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీనగర్ బూత్ నెం. 116 లో తెలంగాణ విమోచన సందర్భంగా‌ శుక్రవారం కసిరెడ్టి భాస్కర రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భవానికి ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోవాలని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ అధికారంలోకి రాగానే రజాకర్ల పాలనను తలపిస్తూ ఎంఐఎంకు ఊడిగం చేస్తున్నారని కసిరెడ్డి భాస్కర రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాఉద్యమాలను అణగదొక్కుతూ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధూ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఇంజ పర్వత్ రెడ్డి, చిలకమర్రి శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్, రాంచంద్రారెడ్డి, రవిబాబు, శ్రీధర్, హన్మంతరావు, భాస్కర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here