నమస్తే శేరిలింగంపల్లి: హిందూ పండుగలు మన భారత దేశ సాంసృతిక, పర్యావరణ, ప్రకృతి రక్షణకు సోపానాలు అని బిజెపి శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ అన్నారు. బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్ సహకారంతో మహిళ మోర్చా అధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆయా ప్రాంతాల్లో మట్టి వినాయకుల ప్రతిమలను, శ్రీ వినాయక వ్రతకల్పము, నిత్య పారాయణ శ్లోకాల పుస్తకాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు శెట్టి మాట్లాడుతూ మన ప్రకృతిని, పర్యావరణాన్ని, చెరువులను దృష్టి లో పెట్టుకొని ఈ వినాయక చవితికి అందరిలో ఆధ్యాత్మిక భావనని నింపుతూ, పర్యావరణ సంరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలనే సదుద్దేశంతో గజ్జల యోగానంద్ సహృదయంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, కోశాధికారి కౌసల్య, నిహారిక, స్వాతి సిరి, బబ్లీ దేవి, స్థానికులు పాల్గొన్నారు.
