నమస్తే శేరిలింగంపల్లి: క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో అండర్ 20 ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ మీట్ లో 5 కేఎం విన్నర్ గా, 1500 మీటర్ రన్నర్ గా నిలిచిన ముడవత్ కృష్ణకు ఎన్టీఆర్ నగర్ తాజ్ నగర్ సోఫా కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అతిథిగా పాల్గొని కృష్ణను సన్మానించారు. ఈ నెల14, 15 వ తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో అండర్ 20 ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ మీట్ లో వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం గట్ల ఖానాపూర్ తాండకు చెందిన ముడవత్ లోకేష్ కుమారుడు ముడవత్ కృష్ణ పాల్గొని చక్కటి ప్రతిభను కనబరచడం సంతోషకరమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కృష్ణ ను అభినందించారు. ఎన్టీఆర్ నగర్ గోపన్ పల్లి లో స్థానికంగా నివాసం ఉంటూ గిరిజన బిడ్డ ముడవత్ కృష్ణ కు ఎన్టీఆర్ నగర్ తాజ్ నగర్ సోఫా కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేతుల మీదుగా రూ. 10 వేల నగదు, నైక్ ష్యూస్ ను అందజేశారు. ఎన్టీఆర్ నగర్ తాజ్ నగర్ సోఫా కాలనీ సొసైటీ సబ్ కమిటీ సభ్యులు బి. విఠల్, కె. నర్సింహారెడ్డి, ఎం. వేణుగోపాల్ రెడ్డి, కె. నగేష్, నాగ సుబ్రహ్మణ్యం నగదు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బి. విఠల్, కోశాధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగ సుబ్రహ్మణ్యం, కృష్ణ, మోహన్, రవి, తదితరులు పాల్గొన్నారు.
