శేరిలింగంపల్లి నియోజవర్గంలోని పాఠశాలలకు నిధులు కేటాయించండి – మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల వసతులతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం అని ప్రభుత్వ‌విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనిత రెడ్డి, మూసి రివర్ బోర్డ్ ఫ్రంట్ చైర్మన్, శాసన సభ్యులు సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, సురభి వాణి దేవి, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, డైరెక్టర్ దేవసేనతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

మన ఊరు మన బడి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సరిపడా బడ్జెట్ ను ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొదటి విడతలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శేరిలింగంపల్లి మండలం పరిధిలో 24 కూకట్‌పల్లి మండలం పరిధిలో 7 మొత్తము 31ప్రభుత్వ పాఠశాలల ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సబ్ కమిటీలో చర్చించి ఈ కార్యక్రమ కార్యాచరణ చేపట్టడటం జరిగిందన్నారు. మొదటి విడత లో 3500 కోట్ల వ్యయం తో 60 శాతం మంది విద్యార్థులు చదివే పాఠశాలలను ఎంపిక చేశారని స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. రెండు ప్రత్యేక అకౌంట్ లు తెరిచి పారదర్శకంగా నిధుల ఖర్చు చేయాలని, అన్ని పనులకు సామాజిక తనిఖీ నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రతి పనికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ లో పొందుపరచటం జరిగిందన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో అన్ని ప్రక్రియలు వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి,‌ ప్రజాప్రతినిధులు, అధికారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here