శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా బలరామ్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఆరెకపూడి గాంధీ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ఆయన ముందుంటారని కొనియాడారు.






