నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, చందానగర్ స్మిత దంత వైద్యశాల సౌజన్యంతో తారా నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డా. శ్రీధర్ రెడ్డి దంత పరీక్షలు చేసి టూత్ పేస్టులు, మందులు పంపిణీ చేశారు. విద్యార్థులకు దంత సంరక్షణపై అనేక సూచనలు చేశారు. రోజూ ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని, ఏదైనా ఆహారం తీసుకొన్న వెంటనే నోటిని నీటితో పుక్కిలించాలని. ఏదైనా దంత సమస్యలు ఉంటే వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా దంత వైద్యున్ని సంప్రదించాలని అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, పోలా కోటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు మాధవి, చంద్రకళ, అనసూయ, విద్యార్థులు పాల్గొన్నారు.