తారానగర్ లో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన విప్ గాంధీ, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరించి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ గిడ్డంగిలో యూజీడీ పనులకు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 15 లక్షల వ్యయంతో తారానగర్ గిడ్డంగిలో యూజీడీ పైపులైన్ పనులు వేయనున్నట్లు తెలిపారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో డివిజన్ ను అన్ని రంగాలలో మౌలిక వసతులు కల్పించి గ్రేటర్ హైదరాబాద్ లోనే శేరిలింగంపల్లి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్, జనార్దన్ రెడ్డి, మల్లికార్జున శర్మ, వాటర్ వర్క్స్ డీజీఎం నాగ ప్రియ, ఏరియా మేనేజర్ సుబ్రహ్మణ్యం రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

తారానగర్ గిడ్డంగిలో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here