శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): భారతదేశ స్వాతంత్ర్యసమరయోధుడు, భారతదేశ సైన్యాధిపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ విజ్డమ్ గ్రామార్ హై స్కూల్ లో బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ సమక్షంలో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించి తదనంతరం స్కూల్ విద్యార్థులకు ఎస్సే రైటింగ్ నిర్వహించి బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ హాజరై సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం అంటే అడిగి తీసుకునే బిక్ష కాదు పోరాడి సాధించుకోనే హక్కు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని ఆ స్వాతంత్ర్య సమరయోధుడు అన్న మాటలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జితేందర్, సీనియర్ నాయకులు రమణయ్య, శ్రీధర్ రావు, రవి గౌడ్, వర ప్రసాద్, అజిత్, పవన్, విష్ణు, రాజు ముదిరాజ్, సురేష్ కురుమ, అశోక్, పాలం శ్రీను, రాజు యాదవ్, నర్సింహా యాదవ్, కుమార్, బాలరాజు, మనోజ్, రాజు యాదవ్, వెంకట్, వినయ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





