నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా పనిచేస్తూ అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీఏ నగర్, హెచ్ఎంటీ కాలనీలలో క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసిన క్రిస్మస్ కానుకలను కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. అన్ని మతాలను సమానంగా చూస్తూ ప్రతి సంవత్సరం కానుకలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఫాస్టర్ రత్నం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రామచంద్ర, జీతయ్య, చంద్రయ్య, బిక్షపతి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
