ఆరోగ్య పరిరక్షణపై అశ్రద్ద వద్దు

  • ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: హాఫిజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఇంజినీర్స్ ఎన్ క్లేవ్ కమ్యూనిటీ హాల్ 1 నందు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, కంటి, దంత, పరీక్షలతో పాటు ఈసీజీ మొదలగు పరీక్షలు చేపట్టారు.  డాక్టర్ ఫయాజ్ (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ రవితేజ రుద్రరాజు (ఆర్తో), డాక్టర్ రామ్స్(ఐ), డాక్టర్ నవీన్ జక్కుల ( డెంటల్ ), వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల పలు రకాల వ్యాధులకు గురవుతున్నారు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలి. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ , పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు , తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. సాధ్యమైనంత మేరకు ఆల్కహాల్ , పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. అనారోగ్యంగా ఉంటే, అశ్రద్ధ చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పాటించి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు ఆంజనేయ రాజు, జయపాల్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, రంగారావు, గోపాలరావు, JN రావు, DSR ప్రసాద్, రామి రెడ్డి, ప్రభాకర్ రావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, పాలం శ్రీను, జనార్ధన్, హాస్పిటల్ ప్రతినిధి అజిత్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ శిబిరంలో 100 మందికి వైద్యసేవలు అందించారు.

ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here