స్టాలిన్ నగర్ లో నీటి పైపులైన్ వేయాలని వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కి వినతి

 

నమస్తే శేరిలింగంపల్లి:  మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ వేయాలని స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఖైరతాబాద్ లోని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్(M.D) శ్రీ దాన కిషోర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ..గత 20 సంవత్సరాల క్రితం శేరిలింగంపల్లి పురపాలక సంఘం గా ఉన్నప్పుడు వాడుక నీటి కోసం వేసిన హెచ్ డి సి పైప్ లైన్ లకి నాటి అధికారులు ఇంటింటికి మంచినీటి కనెక్షన్లు ఇచ్చారని, కాలనీలో మెయిన్ రోడ్డులో నాలుగు సంవత్సరాల క్రితం కొత్తగా బీడుపైపూ వేశారని మిగతా ఇంటింటి కనెక్షన్లు పైపులన్నీ గత పురపాలక సంఘం ఆధ్వర్యంలో 20 సంవత్సరాల కింద ఇచ్చిన అది 4-5 అడుగుల లోతు నుంచి ఇండ్లలోకి నీళ్లు సరఫర అవుతున్న విషయాన్ని ఎం.డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. చాలా సంవత్సరాల నుంచి మొదట్లో జిహెచ్ఎంసి అధికారులకు ఆ తర్వాత వాటర్ వర్క్స్ అధికారులకు అనేక వినతి పత్రాలు ఇచ్చిన సమస్యను పరిష్కరించలేదని గుర్తు చేశారు. 2019లో దాన కిషోర్ స్టాలిన్ నగర్ సందర్శనకు వచ్చినప్పుడు సమస్యను స్వయంగా చూశారని తనే స్వయంగా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ గత నాలుగు సంవత్సరాలుగా సమస్య పరిష్కరించబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కాలనీ ప్రతి గల్లీలో నూతనంగా మంచినీటి సరఫరా కోసం పైప్ లైన్ వేస్తూ మళ్ళీ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇవ్వాలని మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం ఇచ్చే సమయంలో అక్కడే డిపార్ట్మెంట్ మీటింగ్ లో అందుబాటులో ప్రాజెక్టు వన్ డైరెక్టర్ రెడ్డి శ్రీధర్ బాబు, మియాపూర్ డీజిఎం నాగ ప్రియకు స్టాలిన్ నగర్ లో వెంటనే మంచినీటి పైప్లైన్ వేయాలని ఆదేశాలు ఇచ్చారని రమేష్ తెలిపారు గత అనేక సంవత్సరాలుగా స్టాలిన్ నగర్ లో అడపా దడపా గా సరఫరా అవుతున్న మంచినీటిని సక్రమంగా వినియోగించుకోవడానికి నూతనంగా పైప్ లైన్ వేయడానికి ఇప్పటికైనా అధికారులు పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు అండూరి శంకర్, దేపూరి శ్రీనివాసులు ఉన్నారు

దానకిషో ర్ కు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here