శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ 23.03.2025 ఆదివారం ఉదయం 10 :00 గంటలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి రూ.1 కోటీ 26 లక్షల 80 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణము పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని కార్పొరేటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీ సాయి నగర్ కాలనీ లో రూ.38.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీ లో రూ.44.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు, హెచ్ఎంటి కాలనీ లో రూ.44.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.