శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా అర్బన్ నూతన అధ్యక్షుడిగా నియమితులైన వనిపల్లి శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కాంటెస్ట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి పొందిన పదవి ఆయన కఠోర శ్రమకు, నిజాయితీకి దక్కిన ప్రతిఫలం అని అన్నారు. ఇది మనందరికీ గర్వకారణమని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేస్తే శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందన్నారు. పార్టీ బలోపేతం చెందుతుందని అన్నారు. నియోజవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అశోక్ కురుమ, రవీందర్రావు, భాస్కర్, రెడ్డి, k.నరేష్, రామరాజు , బుచ్చిరెడ్డి , కేశవులు, వసంత్ యాదవ్ , నాగుల్ గౌడ్ , నరేందర్ రెడ్డి , నర్సింగ్ యాదవ్ , చారి, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, సీతారామరాజు, వినయ, వరలక్ష్మి , పద్మ, రాష్ట్ర, జిల్లా, మహిళా మోర్చా, యువ మోర్చా ,ఎస్సి మోర్చా, ఎస్టీ మోర్చా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.