శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ లో 2000 గజాలలో రూ.1 కోటి 68 లక్షల 45 వేల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే మైనారిటీ మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీ సమాజం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు అని, అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్నారని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని హంగులతో సకల సౌకర్యాలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను 2000 గజాలలో నిర్మించడం జరుగుతుందని అన్నారు. పేద , మధ్యతరగతి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మైనారిటీ మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నాణ్యతా ప్రమాణాల తో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనారిటీ సోదరులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






