శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శాంతినగర్ కాలనీలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకుడు పవన్ ప్రజా సమస్యలను TSSPDCL అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కాలనీలోని ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, లూజ్ వైర్లు, సైడ్ యాంగిల్స్, అలాగే విద్యుత్ వైర్లకు తగులుతున్న చెట్టు కొమ్మల వల్ల కలుగుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు వివరించారు. ఈ ఫిర్యాదులను అసిస్టెంట్ ఇంజనీర్, లైన్‌మెన్‌లకు పవన్ తెలియజేయగా సెక్షన్ అధికారులు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించారు. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు వీలైనంత త్వరగా అవసరమైన పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో TSSPDCL తారనగర్ సెక్షన్ అధికారులు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లైన్‌మెన్ రాజు నాయక్, అంజనేయులు, కిరణ్, సెక్షన్ సిబ్బంది, స్థానిక నాయకులు పవన్, రామదాస్, శ్రీనివాస్ గౌడ్, చందు, సాయి చరణ్, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.






