నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల సౌకర్యార్థం, పాదచారులు సులువుగా రోడ్డు దాటేందుకు వీలుగా నియోజకవర్గం లోని పలుచోట్ల పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) లను నిర్మించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా గల ప్రధాన రహదారి పై నూతనంగా చేపట్టిన పాదచారుల వంతెన నిర్మాణ పనులను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాలను గుర్తించామన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను, ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించడం జరుగుతుందని అన్నారు. పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ రూపదేవి, ఏఈ ధీరజ్ , ఆర్ అండ్ బి డీఈ రామకృష్ణ, వర్క్ ఇన్ స్పెక్టర్ లు జగన్,హరీష్,మాజీ కౌన్సిలర్ రవీందర్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు వాలా హరీష్ తదితరులు పాల్గొన్నారు.