నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఎంతో ఊరట లభిస్తుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు పేద కుటుంబాలకు చెందిన బాధితులు ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా ముఖ్య మంత్రి సహాయ నిధి రూ. 7.93 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు బ్రిక్ శ్రీను , కాశినాథ్ యాదవ్, సాంబశివరావు, సైదేశ్వరరావు, అప్పారావు, శంకర్ ,రాములు తదితరులు పాల్గొన్నారు.