హైదరాబాద్ వరద బాధితులు సహాయం కోసం రోడ్డెక్కారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వల్ల సహాయం పంపిణీని నిలిపివేశారు. సోమవారం నుంచి సహాయం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలో సహాయం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు బాధితులు సోమవారం సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే బాధితులను పోలీసులు చెదరగొట్టారు.
కాగా నగరంలో పలు చోట్ల మీసేవా కేంద్రాల వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున వరద బాధితులు లైన్లలో నిలబడ్డారు. రూ.10వేల సహాయం వెంటనే పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో నగర కమిషనర్ లోకేష్ కుమార్ స్పందిస్తూ.. వరద సహాయాన్ని నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేస్తామని, ప్రజలెవరూ మీ-సేవ కేంద్రాల వద్దకు రావల్సిన అవసరం లేదని తెలిపారు.