నమస్తే శేరిలింగంపల్లి: ఓ కార్‌షెడ్‌లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని నాలుగు కార్లు తగులబడటంతో పాటు సిబ్బందికి గాయాలయిన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాష తెలిపిన వివరాల ప్రకారం… స్థానికంగా నివాసం ఉండే మురళికృష్ణ అనే వ్యక్తి నల్లగండ్ల హుడాలో ఒక కార్‌షెడ్‌ను నడిపిస్తున్నాడు. అందులో భరత్, సందీప్‌రెడ్డి అనే వ్యక్తులు పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే షెడ్‌లో నిద్రించిన సదరు సిబ్బంది ఆదివారం తెల్లవారు జామున తలుపు తీసే వరకు పెద్ద ఎత్తున మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఒకరికి మొకాలు కింది భాగంలో గాయమయ్యింది. అప్పటికే షెడ్‌లో ఉన్న రెండు ఇండిక కార్లు, ఒక మాంజ కార్ మంటల్లో పూర్తిగా తగలబడిపోయాయి. మరో సాంట్రోకారు స్వల్పంగా కాలిపోయింది. దీంతో బాదితులు ఫైర్, పోలీసులకు సమాచారం అందించగా పటాన్‌చెరు అగ్నిమాపక బృందం వచ్చి మంటలను ఆర్పారు. ఈ మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాదమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు తెలిస్తుంది. షెడ్‌లోని కరెంట్ మీటర్ పక్కన ఒక హీటర్ ఉంచారని, అక్కడి నుంచే మంటలు అంటుకుని ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. గాయపడిన సిబ్బందని చికిత్సకోసం స్థానిక ప్రైవేట్ దవాఖానాకు తరలించారు.