శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో అందరూ ముఖ్య భూమిక పోషించాలని, ప్రతి బూత్ నుండి ఇద్దరు క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి డివిజన్ మసీద్ బండ కార్యాలయంలో సామ రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యశాల సమావేశంలో ఇంచార్జి సుభాష్ చందర్, కన్వీనర్ రాఘవేంద్రరావు, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నరేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, కో కన్వీనర్ మణిభూషన్, ఇంఛార్జి మహిపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యభద్ధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను నడిపించుడానికి బూత్ స్థాయి నుండి జాతీయస్థాయి వరకు బీజేపీ ఎన్నికల కార్యక్రమం నిర్వహిస్తున్న విషయము అందరికీ తెలిసిందేనన్నారు. అందులో భాగంగానే జిల్లా సంఘటన పర్వ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టంగా తయారు చేయాలని దాని కోసం పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుండి ఇద్దరు క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయించాలని కోరారు.
రాష్ట్ర నాయకత్వం జిల్లాలన్నింటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, సహ రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందని, వారితోపాటు డివిజన్ లలో కూడా నియమించుకుని పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యకులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అన్ని మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, కార్పొరేటర్, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.