శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): పేద ప్రజలకు అండగా నిలుస్తూ, సేవే మార్గంగా శ్రీ కృష్ణా యూత్ ప్రతి అడుగు ముందుకు వేస్తుందని శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రెసిడెంట్ వైభవ్ కృష్ణ గౌడ్ ఉచితంగా వీల్ చైర్ లను పంపిణీ చేశారు. శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని అన్నోజిగూడ గ్రామం పోచారం పంచాయితీ కేఎల్ మహేందర్ నగర్ వికలాంగుల కాలనీలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ తో కలిసి జగదీశ్వర్ గౌడ్ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు. శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎప్పుడూ ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మెట్టు బాల్ రెడ్డి, దత్త సాయి, రామ్, దినేష్, అరుష్, ధీరజ్, సుహాస్, వికలాంగుల కాలనీ సీనియర్ నాయకులు నర్సింహ గౌడ్, ఉపేందర్ గౌడ్, అర్బన్ లోకల్ బాడీ వికలాంగుల అధ్యక్షుడు ఆకుల లింగమల్లు యాదవ్, బాల మైసయ్య, భిక్షపతి, శతకోటి, రాజు గౌడ్, సిహెచ్ కిష్టయ్య, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు సయ్యద్ గౌస్, మూర్తి, శ్రీ కృష్ణ యూత్ అడ్వైజర్ డి.రాజు, సునీల్ విశ్వనాథ్, గిరిబాబు, చైర్మన్ బాలరాజ్ ముదిరాజ్, మాజీ అధ్యక్షుడు బాలకృష్ణ, భాస్కర్, యూత్ సభ్యులు సతీష్, రాజు, శివానంద్ రెడ్డి, భరత్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.