శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సప్ప భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్వతి కల్యాణం హరికథ ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు గాను విజయనగరానికి చెందిన మందపాక ఈశ్వరమ్మ వయొలిన్, తెనాలికి చెందిన ఎం.నగధర రావు మృదంగం సహకారం అందించారు. ప్లాంజరి ఫౌండేషన్ వ్యస్థాపకుడు శంకర్ నారాయణ, రాజ్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.