శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): యం సి పి ఐ (యు) మియాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో నడిగడ్డ తండా, ముజఫర్ అహమ్మద్ నగర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్134వ జయంతిని యం సి పి ఐ (యు)మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, సహాయ కార్యదర్శి పల్లె మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితాన్ని దళితుల అభ్యున్నతి కోసం అంకితం ఇచ్చారని అన్నారు. సమాజంలో దళితులు గౌరవంగా బ్రతకడం కోసం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడం కోసం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలోయం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నాయకులు అంగడి పుష్ప, యార్లగడ్డ రాంబాబు, మియాపూర్ డివిజన్ నాయకులు శివాని, యం డి సుల్తానా బేగం, డి నర్సింహా, మధు సూదన్, రజియా బేగం, దేవేందర్, రాములు, శ్రీకాంత్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.