గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతోనే సరిపెట్టుకోకూడదని, వాటిని సంరక్షించే బాధ్యతలను కూడా తీసుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లు, డివిజన్ ఆఫీస్‌లు, శిక్షణా కేంద్రాల్లో మొక్కలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, సీఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీ క్రైమ్స్ కవిత, ఆర్ఐలు పాల్గొన్నారు.