శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సుముఖశ్రీ కళా కుటీర బెంగళూరు నుండి విచ్చేసిన కళాకారులు అశ్విని సుకీర్తి బృందం భరతనాట్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. తం తం తం మూషిక వాహన, రరావేణు,సరసిజాక్షులు, దరు వర్ణం, శ్రీరాజరాజేశ్వరీ, జావళి, చంద్రచూడా, నవరస రామాయణ మొదలైన అంశాలను గురువు అశ్విని సుకీర్తి, స్వాతి, పూజిత, రక్షిత, మోనికా, సుదీప్తి, వర్ష, కీర్తన, వైభవి లు చక్కని ప్రదర్శన ఇచ్చి అలరించారు.