నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ డీఈ రూపాదేవి, ఏఈ రమేష్‌లతో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డివిజన్‌లోని అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చించారు. పెండింగులో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని కార్పొరేటర్ అధికారులను సూచించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులను ప్రతిపాధనలు సిద్దం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈ రూపాదేవి ప్రాధాన్యతా క్రమంలో డివిజన్‌లోని సమస్యలన్ని పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
