కోవిడ్‌పై మంత్రి స‌బిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో స‌మీక్ష‌… శేరిలింగంప‌ల్లిలోని ప‌రిస్థితుల‌ను వివ‌రించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో బుద‌వారం కోవిడ్‌పై జరిగిన సమీక్ష సమావేశంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పి చైర్ పర్సన్ అనిత రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యాలక్ష్మి, డీసీహెచ్ఎస్‌ జాన్సీ, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నాలుగు వ్యాక్సినేషన్ సెంటర్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని అన్నారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, శేరిలింగంపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, హాఫీజ్‌పేట్ అర్భ‌న్‌ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఎల్లమ్మబండ అర్భ‌న్‌ ప్రైమరీ హెల్త్ సెంటర్ల‌లో కొన‌సాగుతున్న వ్యాక్సినేష‌న్‌తో పాటు ప్రజాఅవసరాల దృష్ట్యా అధ‌నంగా మ‌రో 11 వ్యాక్సినేషన్ సెంటర్ల ను ఏర్పాటు చేయాలని కోరారు.

స‌మీక్ష స‌మావేశంలో తోటి ఎమ్మెల్యేలు, అధికారుల‌తో క‌ల‌సి మంత్రి స‌బిత ఇంద్రారెడ్డితో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

అదేవిధంగా 5 బస్తి దవాఖానాలు ప్రారంభం చేయాల్సి ఉంది అని, వాటిని త్వరితగతిన ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మరింత చేరువగా వైద్యం అందించేందుకు అదనపు సిబ్బంది ఎంతో అవసరం ఉంద‌ని, వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. అదేవిధంగా బ్లాక్ ఫంగస్ స‌మస్య, ఇంజెక్షన్ల కొరత‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఒక్కో ఇంజ‌క్ష‌న్‌ బ్లాక్ లో 48,000 /- పైగా వసూలు చేస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నార‌ని, వీటిని అరికట్టాలని అన్నారు. అలాంటి దోపిడీకి పాల్ప‌డుతున్న ఆసుపత్రుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెల్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రైవేట్ హాస్పిట‌ల్స్ అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అదేవిధంగా బ్లాక్ ఫంగస్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో 120 బెడ్లతో చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జిల్లాలోని జర్నలిస్టులకు వ్యాక్సినేష‌న్ కోసం ప్రత్యేక సెంటర్‌లు ఏర్పాటు చేశామని, జిల్లాలో సరిపడ ఆక్సిజన్, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here