శేరిలింగంపల్లి, జనవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మియాపూర్ బస్టాప్ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు సర్వీస్ రోడ్డు ఆక్రమణలను తొలగించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు కూకట్‌పల్లి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో వాహనదారులు సహకరించాలని అన్నారు.






