హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించ తలపెట్టిన నిరసన, ఆందోళన, ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యాలు విఫలం అయ్యాయని, అందుకనే ఈ నెల 22,23 తేదీల్లో అన్ని డివిజన్లు, సర్కిల్ ఆఫీసుల్లో భోజన విరామ సమయాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని, ఈ నెల 24, 25 తేదీల్లో సర్కిల్ ఆఫీసుల్లో రిలే నిరాహార దీక్షలను చేపట్టాలని, మార్చి 2వ తేదీన హైదరాబాద్‌లోని ఎస్‌పీడీసీఎల్ ఆఫీస్‌లో ధర్నా చేపట్టాలని, మార్చి 5న వరంగల్ ఎన్‌పీడీసీఎల్ ఆఫీస్‌లో ధర్నా నిర్వహించాలని, మార్చి 18వ తేదీన చలో విద్యుత్ సౌధ కార్యక్రమం నిర్వహిస్తామని.. ఈ కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
