మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కోదండపాణి సంగీత విద్యాసంస్థ శ్రీ భక్త రామదాసు కీర్తనలను ఆలపించి అలరించారు. పలుకే బంగారమాయెనా, పాహి రామ ప్రభో, రామభద్ర రారా, కంటి నీదు, ఇనకుల తిలక, సకలేంద్రియములారా, పవన రామ, చరణములే నమ్మితిని, ఈ తీరుగ నను, గరుడగమనా రారా, ఇక్ష్వాకు కుల తిలక, రామచంద్రయ్య జనక రాజరాజ మనోహరయా తదతర కీర్తనలను ఆలపించారు. రాజ్యలక్ష్మి శిష్య బృందం ఈ కీర్తనలను ఆలపించి ఆకట్టుకున్నారు.