నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ప్రధాన రహదారి పై నూతనంగా ఏర్పాటు చేసిన హీరో ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాల షో రూమ్ ను బుధవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుతున్న ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రికల్ స్కూటర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, శబ్ద, వాయు కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ఈసందర్భంగా షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, ఓ. వెంకటేష్ ,అక్బర్ ఖాన్, కొండల్ రెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు.