బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ‌బండి సంజయ్ పై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన‌ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నాయకులు బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ హన్మంతరావు స్థాయిని మరిచి విమర్శించడం సరికాదన్నారు. అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ రౌడీయిజం చెలాయిస్తూ సామాన్య ప్రజలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ కోరాలని హెచ్చరించారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలపై కొంతమంది గుండాలు చెంచా అనుచరులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రాష్ట్ర రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చెట్టి మహేందర్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, దయాకర్, తిరుపతి , గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, శ్రీరాములు, ధనరాజ్ సింగ్, సుబ్రమణ్యం, హరీష్ శంకర్ యాదవ్ , కిషన్ సింగ్, అనిల్, మన్నే రమేష్, రంగస్వామి, వేణు, శివ ప్రసాద్ , శ్రీనివాస్ , క్రాంతి, ప్రశాంత్, శ్రీనివాస్, రాజు, సతీష్, మధు, కృష్ణా, ప్రవీణ్, దినేష్, విజయ్, గుండప్పా, రాజు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

విప్రో సర్కిల్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here