నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ పోలీస్ బెటాలియన్ క్యాంపస్ లో బుధవారం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను ప్రజలందరూ పాటించాలని కోరారు. కార్యక్రమంలో యూత్ నాయకులు దీపక్, ఎస్ ఆర్ పీ రాజయ్య, హాస్పిటల్ సిబ్బంది సంతోషి, కుర్బు, విశాలి తదితరులు పాల్గొన్నారు.