నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ ఆదివారం వివేకానందనగర్ డివిజన్ భాగ్అమీర్‌లోని బిజెపి శేరిలింగంపల్లి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ నివాసానికి వెళ్లి డివిజన్ కోవిడ్ పరిస్ధితులపై ఆరా తీశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవాలని స్థానిక నాయకులు ఆయన సూచించారు. లాక్‌డౌన్ వల్ల పేదప్రజలు అవస్థలు పడుతూ ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, తోచిన సహకారం అదిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.
