సాయివైభ‌వ్ కాల‌నీలో వ‌రద‌నీటి కాలువ ప‌నుల‌ను ప‌రిశీలించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ నుండి ఎల్లమ్మ చెరువు (ల్యాంకో హిల్స్) వరకు సుమారుగా రూ.1.40 కోట్ల‌ అంచనావ్యయం తో నూతనంగా నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను ఆరెకపూడి గాంధీ ఆదివారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వ‌ర‌ద‌ నీటి కాలువ నిర్మాణ పనులలో వేగవంతం పెంచాలని, రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారుల‌కు సూచించారు. వరద నీటి కాల్వ నిర్మాణము, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని ఆదేశించారు. ఈ క్ర‌మంలో అధికారుల‌కు ఆయ‌న ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు అంద‌జేశారు.

వ‌ర‌ద‌నీటి కాలువ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here