బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి నేత‌ ఏకాంత్ గౌడ్ గో పూజ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు ఉప్ప‌ల ఏకాంత్ గౌడ్‌ “గో పూజ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం‌ బోయిన్ పల్లిలోని గోశాలలో ఏకాంత్ గౌడ్ తదితరులు కలిసి గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏకాంత్ గౌడ్‌ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర‌ రథసారథి బండి సంజ‌య్ నేతృత్వంలో త్వ‌ర‌లో తెలంగాణ గ‌డ్డ‌పై కాషాయ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని అన్నారు. అసెంబ్లి ఎన్నిక‌ల్లో క‌రీనంగ‌ర్ నుంచి ఓడిపోయిన బండి సంజ‌య్ ఆరు నెల‌ల్లో ఎంపీగా గెలిచి, రాష్ట్ర అధ్య‌క్ష భాద్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆయ‌న లోని కార్య‌ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌నంలో రాష్ట్రం న‌లుమూల‌ల పార్టీ ఎంతో బ‌ల‌ప‌డింద‌ని అన్నారు. బండి సంజయ్ ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు.

గోవులకు పశుగ్రాసాన్ని ఆహారంగా అందజేస్తున్న బిజెపి నాయకులు ఏకాంత్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here