నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆపన్నహస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలువురు ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలకు ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 4,32,000/- నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన ఆర్థికసహాయంతో పేద కుటుంబాల్లో కాస్త ఉపశమనం కలుగుతుందన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై, ప్రమాదాలతో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు , వివేకానంద నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, కోనేరు ప్రసాద్, సమ్మారెడ్డి , చిన్నోళ్ల శ్రీనివాస్, రాజేష్ చంద్ర, వాసుదేవరావు , శిరీష తదితరులు పాల్గొన్నారు.