శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం వీకర్ సెక్షన్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా భవానీపురం వీకర్ సెక్షన్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే భవానీపురం వీకర్ సెక్షన్ కాలనీలో పర్యటిస్తానని, త్వరలోనే రోడ్డు పనులను ప్రారంభిస్తామని, కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు రఘునాథ్ రెడ్డి, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






